తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.పేదల కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి స్టీల్ కంపెనీలు కూడా సముచిత ధరకు స్టీల్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, స్టీల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.