జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ చేస్తున్న రాజకీయాలు కరెక్ట్‌గా గమనిస్తే.. ఆయన జగన్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్నప్పుడు అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయినప్పుడు ఆ మ్యాటర్‌ని డైవర్ట్ చేయడం కోసం పవన్ బయటకు రావడం.. ఆ సమస్యను పక్కదోవ పట్టించడం.. చివరికి వైసీపీని విమర్శించి మళ్ళీ కనుమరుగు అయిపోవడం ప్రజలు చూస్తూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ నినాదంతో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారడంతో రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కనబడడంతో పవన్ తన రూట్ మార్చడం జరిగింది. ఈ నేపధ్యంలో ఏపీకి అన్యాయం జరిగిందని జేఎఫ్‌సీ కమిటీ ఏర్పాటు చేసి మరోసారి ప్రత్యేక హోదాని పక్కదోవ పట్టించడానికి పవన్ మరో డ్రామాకి తెరలేపారు. అయితే జగన్ మాత్రం ఈసారి పవన్‌ని సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగానే పవన్‌కు పూర్తిగా చెక్ పెట్టడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకే చెందిన సాలిడ్ వ్యక్తిని రంగంలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
ఇక ఆ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి తెరపైకి తెచ్చి పవన్‌కు షాక్ ఇవ్వాలని వైసీపీ వర్గీయులు కూడా అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ మూవీ క్రిటిక్ కత్తి మహేష్ దెబ్బకు పవన్ ఇమేజ్ ఓ రేంజ్‌లో డ్యామేజ్ అయ్యింది. మరి ఈసారి పవన్‌ని పోసాని టార్గెట్ చేస్తే.. పవన్‌కి డ్యామేజ్ ఏ రేంజ్‌లో జరుగుతుందో ఊహించడం కూడా చాలా కష్టం అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తం మీద ముల్లును ముల్లుతోనే తీసినట్టు.. సినీ నటుడైన పవన్‌ని.. అదే సినిమాకి చెందిన నటుడితోనే చెక్ పెట్టాలని జగన్ ఆలోచన రాజకీయ వర్గాల్లో మరో హాట్ టాపిక్ అని… ఇక రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేల పోసాని కృష్ణమురళి వైసీపీ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఒకవేల ఇదే జరిగితే చంద్రబాబు గ్యాంగ్‌కి.. పవన్ బ్యాచ్‌కి రంగు పడడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.