ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్టమూర్తి ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. పత్తికొండ మాజీ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. కేఈ శ్యామ్‌బాబుకు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శ్యామ్‌బాబు సహా ఆస్పరి జెడ్పీటీసీ బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్సై నాగ ప్రసాద్‌లపై కోర్టు వారెంట్ జారీ అయ్యింది. వారిని హత్య కేసులో నిందితులుగా చేర్చి… అరెస్ట్ చేయాలని ఆదేశించింది. నారాయణ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య కంగాటి శ్రీదేవి కోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ ఆమె తన వాదన వినిపించారు. తన భర్తతోపాటు మరో వ్యక్తిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్‌బాబు ఆయన అనుచరులు అతి కిరాతకంగా హత్య చేశారని తెలిపారు. అయిన ఆయన్ను నిందితులుగా చేర్చలేదని భార్య శ్రీదేవి ఆరోపించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి… శ్యామ్‌బాబు పేరు ఛార్జ్‌షీట్‌లో తొలగించారన్నారు. దీనిపై ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు.
అంతేగాక మరల కొద్ది రోజుల తర్వాత తన భర్త హత్య కేసులో అన్యాయం జరిగిందంటూ… డోన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం… నిందితులతో పాటూ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణ జరిపి వారెంట్ జారీ చేసింది. నారాయణ రెడ్డి హత్య కేసులో శ్యామ్‌బాబుపై మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ విమర్శలను కేఈ కృష్టమూర్తి ఖండించారు. ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు. కాని ఈలోపే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో శ్యామ్‌బాబు చిక్కుల్లో పడిపోయారు.
Tags arreest cherukulapadu narayana reddy dhone court ke shyam babu pattikonda ysrcp