తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి వివేకానంద గౌడ్, కార్పోటర్లు జగన్, సత్యనారాయణ, రావుల శేషగిరి, ఎం.డి రఫీక్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, టిఆర్ఎస్ కుత్బుల్లాపూర్మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.