ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ధర్నాలు ,ఆందోళనలు చేస్తారు.
అప్పటికి కేంద్రం దిగిరాకపోతే ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఏపీకి వస్తారు అని ఆయన తేల్చేశారు.అంతే కాకుండా ఏపీ అధికార టీడీపీ నేతలకు కూడా సవాలు విసిరారు జగన్.మీరు మీ పదవులకు రాజీనామా చేయండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం అని ఆయన అన్నారు .దీనికి సమాధానంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ,ప్రస్తుత మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఫ్యాకేజీలో ఉన్న హమీలన్నిటిని అమలు చేయాలి .
అలా చేయకపోతే కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని మీడియా సాక్షిగా ప్రకటించేశారు.అయితే అంతలో ఏమైందో ఏమిటో కానీ వెంటనే మాట మార్చి అంతా తమ అధిష్టానం చూసుకుంటుంది అని అనేశారు.అయితే జగన్ విసిరిన సవాలుకు ఏమి స్పందించాలో అర్ధం కాక ఆగం ఆగమై ఇలా మంత్రి మాట్లాడుతున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.