ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైసీపీ అధినతే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైసీపీ వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న జగన్.. చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ ట్వీట్‌లో ఇది విభేదాలకు సమయం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే దిశగా, ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని కోరుతూ జగన్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కని, ఈ డిమాండ్ సాధనకు రాష్ట్రంలోని ఎంపీలందరూ రాజీనామాలు చేయాలని గత రాత్రి ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ట్యాగ్ చేస్తూ, వైసీపీ ఎంపీలు తొలుత రాజీనామాలు చేస్తారని, వారిని మీ ఎంపీలు కూడా అనుసరిస్తారా… లేదంటే ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉంటారా… అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ వేల కొద్దీ షేర్లను, లక్షల కొద్దీ లైక్స్‌ను తెచ్చుకుని వైరల్ అవుతోంది. మరి జగన్ ట్వీట్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు రిప్లై ఇస్తారో.. లేక తెరవెను రాజకీయాలు కంటిన్యూ చేస్తారో చూడాలి.