Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ మాస్ ఛాలెంజ్‌.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!

జ‌గ‌న్ మాస్ ఛాలెంజ్‌.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్ర‌త్యేక‌ హోదా కోసం చిత్త‌శుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాద‌యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జ‌గన్ మాట‌లు ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ప్ర‌త్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేందుకు ఏప్రిల్ ఆరోతేదీన సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించాలని సవాల్ చేశారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని జగన్ చె్పారు. ప్రత్యేక హోదా పోరాటంలో టీడీపీ తమతో కలిస్తే హోదా సాధన సులభమవుతుందన్నారు. ఎంపీల రాజీనామాతో దెబ్బకు కేంద్రం దిగివస్తుందన్నారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేస్తే.. హోదా రాకుండా ఎక్కడికి పోతుందన్నారు.పదవులకు రాజీనామాలు చేయకుండా పార్లమెంటులోపల, బయట ఆందోళన చేస్తే కేంద్రం దిగిరాదని, తన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇవ్వాలని జగన్ కోరారు.

ఇక మార్చి 5నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీలు పోరాడతారన్నారు. ఏప్రిల్ 6 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని.. అప్పటికి ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు. మార్చి 1న కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహిస్తారని… మార్చి 3న ఎమ్మెల్యేలు, ఎంపీలు సీనియర్లు పాదయాత్ర జరిగే దగ్గరకు వస్తారని అక్కడ జెండా ఊపి ఢిల్లీకి పంపుతామన్నారు జగన్. ప్రత్యేక హోదా మన హక్కు… ప్రత్యేక ప్యాకేజీ వద్దు నినాదంతో మార్చి 5న పార్లమెంట్ దగ్గర పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తారని… ఏప్రిల్ 6 వరకు చూసి… ఫలితం లేకపోతే 6న ఎంపీ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి వస్తారని చెప్పారు. దీంతో జ‌గ‌న్ ఛాలెంజింగ్ స‌వాల్‌ను చంద్ర‌బాబు స్వీక‌రిస్తారా లేక ఇంకేమైనా ఎత్తులు వేస్తారో చూడాలి. ఏది ఏమైనా జ‌గ‌న్ విసిరిన సెన్షేష‌న్ స‌వాల్ దెబ్బ‌కి టీడీపీ పూర్తి డిఫెన్స్‌లో ప‌డిపోయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat