‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. కాగా, గురువారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్‌సీ ఏర్పాటు చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నాయకులను వాడుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు జేపీ సమాధానమిస్తూ.. జేఎఫ్‌సీలోకి ఎవరన్నా వచ్చారంటే.. అందుకు కారణం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాత్రమే వచ్చారని, అంతేకానీ, పవన్ కల్యాణ్‌ను చూసి ఎవరూ రాలేదన్నారు. ఈ దేశం ఎవరొక్కరి సొత్తు కాదు.. ఎన్నికల్లో నెగ్గనివాడు తక్కువైనోడేమీ కాదని తనదైన శైలిలో సమాధానమిచ్చారు జేపీ.