టాలీవుడ్ లో గత ఎడాది అక్టోబర్ 6 న ప్రేమ పెళ్లి చేసుకున్న నాగ చైతన్య , సమంత లు ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీ గా గడుపుతున్నారు. . ఈ నేపథ్యం లో సమంత కడుపుతో ఉందనే వార్త ప్రచారం అవడం అందరిని షాక్ కు గురి చేసింది. టాలీవుడ్ ఫిలిం సర్కిల్లో హాట్ హాట్ చక్కర్లు కొడుతుంది. పదేళ్ల ప్రేమను పండించుకుని పెళ్లి పీటలెక్కారు. వారి పెళ్లి అయ్యి ఐదు నెలలు కుడా సరిగా గడవక ముందే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అసలు పెళ్లయ్యిందో లేదో ఇలాంటి పుకార్లు ప్రారంభమైపోతాయి. పెళ్లయితే పిల్లల్ని కనడమే పనా? వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సమంత ఇప్పట్లో పిల్లల్ని ఎలా కంటుంది? అని కూడా ఆలోచించరు.గతం లో కూడా బాలీవుడ్ హీరోయిన్స్ విద్యా బాలన్, బిపాసా బసు వంటి హీరోయిన్ల విషయం లో కూడా ఇలాగే ప్రచారం జరిగాయి. . ఆమె ప్రెగ్నెంట్ అయితే కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకుంటుంది? ఒకసారి ఆలోచించాల్సిన విషయమే కదా. సమంత నటించిన సినిమాలు ఈ ఏడాది రెండు మూడు ఉన్నాయి. మరోపక్క త్వరలో సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించేందుకు కూడా సిద్ధమవుతుంది..ప్రస్తుతం రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత కడుపుతో ఉందనే వార్త పై అక్కినేని కుటుంబం ఏలా స్పందిస్తుందో చూడాలి.
