ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమచారం. ఓ టీవీ చానెళ్లు జరిపిన చర్చా వేదికలో తనను రాంగోపాల్ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ… దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్న విషయం తెలిసిందే.అయితే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇలాంటి కేసులలో అరెస్టు చేస్తారా..వర్మను ఏమి చేస్తారో చూడాలి.
