తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి అల్లోలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గువ్వల బాలరాజు, భాస్కర రావు, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీయస్ చిత్ర రామచంద్రన్, ఇతర ప్రముఖులు మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.