కీవిస్ ,ఆసీస్ ల మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయి.మొదట బ్యాటింగ్ చేసిన కీవిస్ పెట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఏడు బంతులు మిగిలిఉండగా చేదించింది.అంతే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోనే భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది.
ఆసీస్ ఓపెనర్లు అయిన వార్నర్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో యాబై తొమ్మిది పరుగులు ,ఆర్కీ షాట్ నలబై నాలుగు బంతుల్లో డెబ్బై ఆరు పరుగులను సాధించడంతో కీవిస్ విధించిన లక్ష్యాన్ని చేధించి చరిత్ర క్రియేట్ చేసింది .ఈ క్రమంలో మొదటి వికెట్ కి వీరిద్దరూ యాబై ఒక్క బంతుల్లోనే నూట ఇరవై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
అనంతరం వచ్చిన ఆరోన్ పించ్ పద్నాలుగు బంతుల్లో ముప్పై ఒకటి ,మ్యాక్స్ వెల్ పద్నాలుగు బంతుల్లో ముప్పై అరుపరుగులను సాధించడంతో ఆసీస్ గెలుపు సులువైంది.కీవిస్ ఆటగాళ్ళల్లో గప్టిల్ యాబై నాలుగు బంతుల్లో నూట ఐదు పరుగులను తొమ్మిది సిక్స్ లతో ఆరు ఫోర్ల సాయంతో సాధించడంతో కీవిస్ భారీ స్కోర్ ను సాధించింది.మరోవైపు మున్రో కేవలం ముప్పై మూడు బంతుల్లో ఆరు సిక్స్ లు ,ఆరు ఫోర్లతో డెబ్బై ఆరు పరుగులను సాధించాడు.వీరిద్దరూ తోలి వికెట్కు అరవై నాలుగు బంతుల్లో నూట ముప్పై రెండు పరుగులను జోడించారు.