టాలీవుడ్‌కు చెందిన ఓ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకెళ్తే.. సినిమా అవకాశాల కోసం పంజాబ్ నుంచి వచ్చిన ఆ యువతి మొదట మోడలింగ్‌లో రాణించి పలు షాప్ ఓపెనింగ్‌లలో పాల్గొని తళుక్కున మెరిసింది. అంతెందుకు గత ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఓ చిత్రంలోనూ ఈ బ్యూటీ చిన్న పాత్ర పోషించింది. ఆ తరువాత చిన్న చిన్న చిత్రాల్లో లీడ్ రోల్ పాత్రల్లో చేస్తూ వచ్చింది. ఈ యువతి నటించిన మరికొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాయే తప్ప విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ యువతి చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. రెండు రోజల క్రితం ఓ కాస్ట్లీ హోటల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆ యువతి వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడినట్లు సమాచారం. ఆ సమయంలోనే ఆమె వద్ద ఉన్న బ్యాగ్‌లో నాలుగు బ్లూ ఫిల్మ్ సిడీలు లభించాయని, ఆ సీడీలు కూడా ఆ నటివే కావడంతో ఖంగుతినడం పోలీసుల వంతైంది. అయితే, ఈ వ్యవహారంలో ఆ నటితోపాటు టాలీవుడ్ బడా నిర్మాత, ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలు సేకరించిన తరువాతే ఈ కేసులో ముందుకెళ్లాలని పోలీసులు డిసైడయ్యారట. పోలీసులు ఆ నటి వివరాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నారు.