ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసం గంటా ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా వచ్చాడు..ఈ కథ ఎవ్వరికి తెలియదు..కేవలం డబ్బు కోసం ,పదవి కొసం ఎన్ని పార్టీలు అయిన మారుతాడు అని అన్నారు. గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ మంత్రి గంటా శ్రీనివాసరావు 420 కాదు, 840. ఆయన ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము గంటాకు ఉందా?.
see also..ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!
లక్షల కోట్ల విశాఖ భూ కుంభకోణాల్లో ఆద్యుడు గంటానే. ఆ విషయాన్ని సహచర మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పారు. హుద్‌హుద్ తుఫానుతో విశాఖ అతలాకుతలమైతే గంటా ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అనుకున్నారు. అలాంటి గంటా వైసీపీ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాజీనామాలపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రజల్లో చులకన అయిపోతున్నామని గ్రహించి టీడీపీ నేతలు డ్రామాలకు తెరలేపారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం అందరికీ తెలుసు. టీడీపీకి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు’ అని ధ్వజమెత్తారు.