ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత..ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు. మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.దళిత మహిళను బట్టలూడదీసి కొట్టినా ఈ టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నుంచి పుత్తూరు వరకు మహిళలపై దాడులు జరిగినా నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోపై టీడీపీ ఎమ్మెల్యే(చింతమనేని ప్రభాకర్) దాడి చేసి జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లినప్పుడే.. అతడ్ని ఎన్‌కౌంటర్ చేయాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాజరిగివుంటే ఇప్పుడు మహిళలపై దాడులు జరిగేవి కావని అన్నారు.నిజంగా మనం చూస్తు ఉన్నాం మహిళలపై జరిగే దాడులు చంద్రబాబుకు కనబడలేదా…లేకపోతే టీడీపీ నేతలు ఎమైనా చెయ్యాచ్చా అని వైఎస్ జగన్ అన్నారు.