ఇంటికెళ్లి ఏం చేస్తావ్..! చాన్స్ ఇస్తా వస్తావా..!! .. ఇండస్ర్టీలో అమ్మాయిలకు ఇబ్బందులుంటాయని టాక్. అయితే ఇబ్బందులు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటాయని అంటున్నాడు జబర్దస్త్ ఫణి. అయితే, జబర్దస్త్ ఫణి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో తనకు ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. అయితే, ఆ చిత్రానికి ప్రొడ్యూసర్ అయిన ఓ లేడీ తనను కమిట్‌మెంట్ అడిగిందంటూ చెప్పుకొచ్చాడు. మా వాళ్లు కమిట్ అడుగుతున్నారండీ.. ఏం చెప్పమంటారు అని నన్ను అడగ్గానే.. మార్నింగ్ సిక్స్ వచ్చి ఈవెనింగ్ సిక్స్ కు వెళ్లిపోతా, రెమ్యునరేషన్ అంతా ఒకే అని చెప్పా. ఎంత చెప్పినా ఆ లేడీ ప్రొడ్యూసర్ నన్ను వదల్లేదు. కమిట్‌మెంట్ పేరుతో అక్కడే రెండు గంటలసేపు నిలబెట్టిందంటూ చెప్పుకొచ్చాడు.