తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 11 ఏళ్ల విగ్నశ్ కోరికను తీర్చనున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రఫీ అనే జన్యుపర వ్యాధితో బాధపడుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన కొక్కొండ సతీశ్-సరిత దంపతుల కుమారుడు కొక్కొండ విగ్నేశ్..తరచూ టీవీల్లో కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి, సీఎం కేసీఆర్ తాతను చూడాలని విగ్నేశ్ మారాం చేస్తుండేవాడు.ఈ విషయా న్ని బంధువుల ద్వారా తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చిలువేరు శంకర్, సీపీఐ నాయకుడు నారాయణ, స్పీకర్ మధుసూదనాచారితో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్.. విగ్నేశ్‌ను హైదరాబాద్ ప్రగతి భవన్‌కు తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలో ఈ నెల 17న సీ ఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ ఆ అబ్బాయి కోరిక తీర్చనున్నారు. ఏడాదికి మించి తమ బాబు బతుకలేడని వైద్యులు సూచించారనీ, తమ బాబు చివరి కోరికను తీర్చేందుకు ఒప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి విగ్నేశ్ తల్లిదండ్రులు కొక్కొండ సతీశ్-సరిత కృతజ్ఞతలు తెలిపారు.
see also : ఏడునోట్లుతో వినూత్నంగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..!
see also : ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!