Home / TELANGANA / పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..వాసుదేవ రెడ్డి

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..వాసుదేవ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ చార్జీ వాసుదేవ రెడ్డి అన్నారు . శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్యక్షతన గురువారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీని శేరిలింగంపల్లి డివిజన్ లో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు నడుం బిగించాలన్నారు. పాత,‌కొత్త అనే తేడా లేకుండా కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

సీ ఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను‌ ఇంటింటికి తీసుకెళ్దామన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు త్వరలోనే పార్టీకి సంబంధించిన పదవులు కేటాయించి న్యాయం చేయాలన్నారు. డివిజన్ లో అందరిని ఏకతాటిపైకి‌ తీసుకువచ్చి ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో డివిజన్ కార్యకర్తలు ముందుంటారని పేర్కొన్నారు. డివిజన్ లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను ఇన్ చార్జి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పార్టీ నాయకులను పార్టీ ఇన్ చార్జీ వాసుదేవ రెడ్డికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిచయం చేశారు. అంతకముందు శేరిలిగంపల్లి టీఆర్ ఎస్ పార్టీ డివిజన్ ఇన్ చార్జీగా నియామకమై మొదటి సారి వచ్చిన వాసుదేవరెడ్డి గారిని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో టీఆర్ ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దుర్గం వీరేశం గౌడ్, సోమదాస్,రవీందర్ రావు, పార్టీ నాయకులు బద్దం కొండల్ రెడ్డి, చింతకింది రవీందర్ గౌడ్, విఠలా చారి, మేకల కృష్ణ యాదవ్, నట్ రాజ్, గోవింద్ చారి, గోపి, మేడ్చల్ శ్రీనివాస్, విజయ్ గౌడ్, సత్యనారాయణ, మేడ్చల్ విజయ్, సురేష్, సత్యం, నర్సింహా, చంద్రకళ, విజయలక్ష్మి, జ్యోతి, సౌజన్య, భాగ్యలక్ష్మీ, కుమారి, కమల, వార్డు మెంబర్లు శ్రీకళ, ఫర్వీన్ తో పాటు తదితరులు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat