ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.కాగా.. నిన్న శ్రీవారిని 54,575 మంది భక్తులు దర్శించుకోగా, 20,321 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీ టీ డీ అధికారులు తెలిపారు.