కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేకచోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు . నగదు కొరత వల్ల వేతన జీవులు, పెన్షనర్లు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వినోద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ లో నగదు కొరతను తీర్చాలని ఆయన కోరారు.
