తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మూసి నది అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధితఅధికారులను ఆదేశించారు.ఇవాళ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని.. మూసి నది మెత్తాన్ని సర్వే చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం, సుమారు 40 కిలోమీటర్లను డ్రోన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలతో సర్వే చేయాలని, దీంతోపాటు గతంలో ఉన్న శాటిలైట్ మ్యాపులతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
Minister @KTRTRS held a review meeting on the rejuvenation of Musi river and other lakes in and around Hyderabad. @arvindkumar_ias, Principal Secretary, MA&UD and senior officials from MA&UD department participated in the meeting. pic.twitter.com/IHDJwSAM1d
— Min IT, Telangana (@MinIT_Telangana) February 15, 2018
ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా నదికి ఇరువైపుల రోడ్లు, నదిపై నుంచి ఎలివేటేడ్ ఎక్స్ ప్రెస్ వే, రెంటింటి కలయికతో కూడిన ప్రణాళికలను రూపొందించామని, వీటి నిమిత్తం అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జిల డిజైన్లు, నిర్మాణం సైతం చారిత్రక, సంస్కృతికి అద్దంపట్టేలా ఉండాలని కోరారు. నగర పరిధిలోని చెరువుల అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులను దీర్ఘకాలిక ప్రణాళిలను రూపొందించుకుని దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాకాలం నాటికి కనీసం 50 చెరువులను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.