తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా జరగనున్నాయి.ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చాచా నెహ్రునగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం జలవిహార్‌లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారుఈ సందర్బంగా మీడియాతో అయన మాట్లాడుతూ..ఈ నెల 17న నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు.
see also : ఏడునోట్లుతో వినూత్నంగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..!
భారీ కేక్ కటింగ్‌తోపాటు మెగా రక్తదానశిబిరం, వికలాంగులకు ట్రై సైకిళ్లు, అంధులకు చేతికర్రలు, వృద్ధ మహిళలకు చీరెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.రోజంతా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్నట్టు తలసాని చెప్పారు. వేడుకలకు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరవుతారని ఆయన తెలిపారు. నగరంలోని అన్నిడివిజన్లలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపాలని కార్పొరేటర్లు, నాయకులకు మంత్రి తలసాని పిలుపునిచ్చారు.