వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వచ్చినప్పుడల్లా ఒక విమర్శ చేసే వాళ్లు. జగన్ బీజేపీతో చేతులు కలుపుతున్నాడని.. అందుకే మోదీని ఒక్కమాట కూడా అనలేదని.. బీజేపీ పై విమర్శలు చేయడంలేదని విపరీతంగా ప్రచారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పోందడానికే బీజేపీతో కలవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని అందులో భాగంగానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుతెలిపారని టీడీపీ నేతలు జగన్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా జగన్ రాజీనామాల ప్రకటనతో నేరుగా బీజేపీతో యుద్ధానికి దిగడంతో టీడీపీ బుర్రతక్కువ బ్యాచ్‌కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్ధంకాక తలలు గోక్కుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో జగన్ ప్రకటించిన రాజీనామాల డెడ్‌లైన్ జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎంపీలు రాజీనామాలు చేయడమంటే డైరెక్ట్‌గా ప్రధాని మోదీజీతో ఢీ కొట్టడమే అని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా మోదీకి రాజీనామాతోనే సమాధానం చెప్పనున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయతే రాజీనామాలతో ప్రత్యేకహోదా వస్తుందా.. రాదా.. అనేది పక్కన పెడితే జాతీయ స్థాయిలో ప్రధానఅంశమై వచ్చే ఎన్నికల నాటికైనా ఈ హోదా ప్రధాన నినాదమవుతుందన్నది వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా జగన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి టీడీపీ గ్యాంగ్ విమర్శించే ఛాన్స్‌ని లాగేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.