బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు తర్వాతనే కే.ఆర్.ఎం.బీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావాలని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు. అప్పుడే రాష్ట్రాలకు కేటాయించిన నీటిని విజయవంతంగా వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. గురువారం కేంద్ర జలవనరుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టులో తెలంగాణాకు 45టీఎంసీల హక్కు ఉందని వాదించినట్టు హరీశ్ రావు తెలిపారు.ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందన్నారు.వచ్చే సమావేశంలోనైనా స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు గడ్కరీ, హర్షవర్దన్ లను ఆహ్వానించానని మంత్రి తెలిపారు. అందుకు వారు సుముఖత చూపారని అన్నారు.అభినందనలతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయాలని గడ్కరీని కోరినట్టు హరీశ్ రావు చెప్పారు.
