కార్పోరేట్ ఆసుపత్రులు పేరుకే వైద్యం కాని ఇది చాలా కాస్లీ గురూ..!!పుసుక్కున జాయిన్ ఐతే జేబు కాలీ అవ్వాల్సిందే.అక్కడ పేద,దనిక అనే తేడా ఏం లేదు.అందిన కాడికి గుంజడమే ఇది కొన్ని కార్పోరేట్ ఆశుపత్రుల తీరు. చిన్న రోగమైనా రకరకాల టెస్ట్ లు,జ్వరమస్తే లక్ష వరకు బిల్లు బిల్లు చూస్తే ఆసుపత్రికి వెల్లిన వాళ్ళు ఘెల్లు మంటున్నారు.
ఇదంతా ఇలా ఉంటే తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్యం,వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది.ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్ కు దీటుగా బలోపేతం చేస్తుంది.చాలా చోట్ల కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్యం అందుతుంది.దీంతో చాలా వరకు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.ఐతే కొన్ని మీడియా సంస్థలు కార్పోరేట్ ఆసుపత్రులు నడవక కష్టాల్లో ఉన్నట్టు దాన్ని బ్యానర్ ఐటం చేస్తూ వార్తలు ప్రచురిస్తున్నాయి.కార్పోరేట్ ఆసుపత్రులకు కష్టాలు అని తెలంగాణాలో ప్రభుత్వ ఆసుపత్రులు బలపడుతున్నాయని,తద్వారా కార్పోరేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయని విషం వెల్లగక్కుతున్నాయి.ప్రభుత్వ వైద్యం బలపడినప్పుడు ఈ ఏడుపు ఎందుకు..?పేదలకు నాణ్యమైన వైద్యం అందడం ముఖ్యం అంతే కని కార్పోరేట్ ఆసుపత్రులు దోచుకుంటుంటే అవి కష్ఠాల్లో ఉన్నాయని ప్రచురించడం ఏంటని సామాన్యజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు మెరుగైన వైద్యం పైసా లేకుండా అందుతుంటే ఈ ఏడుపు ఎందుకని వారు మండిపడుతున్నారు.పైగా మంచి పనిని బ్యానర్ ఐటం వేయకుండా లక్షలకు లక్షలు పీజులు లాగుతున్న కార్పోరేటు ఆసుపత్రులకు కొన్ని మీడియా సంస్థలు కొమ్మకాయడం ఏంటని వారు అంటున్నారు.జనాలకు మంచి జరుగుతున్నప్పుడు వీళ్ళకేమవుతుందో అర్దం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.