ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పదవీగండం వస్తుందా?రాదా అన్న చర్చ జరుగుతుంది. సాధారణంగా అయితే సుప్రింకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడితే ఆటోమాటిక్ గా పదవి పోతుందని అంటారు. అయితే వెంటనే బెయిల్ వస్తే ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేదా నేతలకు ఏదైనా శిక్ష పడితే తెలుగుదేశం పార్టీ వారు గగ్గోలు పెట్టేవారు. టిడిపి మీడియా కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రచారం చేసేది. కాని చింతమనేని ప్రబాకర్ శిక్ష గురించి మాత్రం జాగ్రత్తగా వార్తలు కవర్ చేసినట్లు కనబడుతుంది.చింతమనేనిపై 1996 నుంచి పలు కేసులు ఏమోదు అయ్యాయి.ఇప్పటికీ 42 కేసులు పెండింగులో ఉన్నట్లు లెక్క తేలింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్.పి కావూరి సాంబశివరావులపై ఈయన దౌర్జన్యం చేసిన కేసులో శిక్ష పడింది. ఈకేసులో సుప్రింకోర్టుకు వెళ్లి కేసు కొట్టివేయించుకోగలిగితే తప్ప పదవి గండం ఉందని కధనాలు వస్తున్నాయి.
see so..ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!