“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి బాలకృష్ణను ప్రశ్నించగా.. “పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అంటూ కారెక్కి వెళ్లిపోయాడు. అయితే బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరు సినిమా హీరోలే. గతంలో ఈ ఇద్దరు కొన్ని స్టేజ్‌లపైన కలిసి ఫొటోలు కూడా తీసుకున్నారు. అది పక్కన పెట్టినా గత ఎన్నికల్లో టీడీపీకే మద్దతును ఇచ్చి ప్రచారం చేశారు పవన్. ఇలా తమ పార్టీకే ప్రచారం చేసిన వ్యక్తిని బాలకృష్ణ తెలీదని చెప్పడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచింది.
