రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరారు కూడాను.
ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైఎస్ జగన్ అంటే తనకు, తన మామకు ఎనలేని ఇష్టమని, తన మామ వైఎస్ జగన్‌ను కలిపించాలని తనను ఎప్పుడు అడుగుతుంటాడని, వైఎస్ జగన్ పాదయాత్ర వైజాగ్‌కు చేరుకోగానే తన మామను జగన్‌తో కలిపిస్తానని చెప్పిన మాటలు విధితమే. అంతేగాక… ఇటీవల కాలంలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కూడా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరువాత జగన్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇలా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరిగా మీడియా సాక్షిగా బయటపెడుతున్నారు.
ఇదిలా ఉండగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, 2004, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఉంగుటూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉంటూ తటస్థంగా ఉన్న వసంత్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి జంప్ చేస్తాడని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరి ఉంగుటూరు నుంచి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు జిల్లాలో వినిపిస్తున్నాయి.