ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ 12 రోజులుగా టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు.
see also..ఓ మై గాడ్.. జగన్ జస్ట్ మిస్..!
ఢిల్లీలో కొందరు ఎంపీలు గుండు గీయించుకొని ఆరు కోట్ల తెలుగు ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. అచ్చెన్నాయుడికి ఒళ్లు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని మేం మోసం చేయలేదని, ఒక మాట కోసం, విలువల కోసం, విశ్వసనీతయ కోసం పదవులను త్రుణప్రాయంగా వదిలి బయటకు వచ్చి..ఆనాడే సోనియాను ఎదురించిన ధీరుడు , ధీశాలి వైయస్ జగన్ అన్నారు. పదవి కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలు, డ్రామా రాజకీయాలపై, మాకున్న విలువలు, విశ్వసనీయతలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇంకా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వైయస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఏడాది పాటు అవకాశం ఉన్నా ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారని, మీకు విలువలు ఉంటే స్వాగతించాలని, విమర్శించడం తగదన్నారు. మీ గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయని..అందుకే బయపడి ఇలా ఒక్కొక్కరు జగన్ పై దుష్పాచారం చేస్తున్నారని అన్నారు.
see also..జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
చీమ చిటుక్కుమంటే గంటలు గంటలు మీడియాతో మాట్లాడే చంద్రబాబు రెండు వారాలుగా బడ్జెట్‌పై మాట్లాడే దమ్ము, ధైర్యం లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దుబాయి నుంచి రాగానే గంట ప్రెస్‌మీట్ పెట్టే వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేవలం మీడియాకు లీకులు ఇస్తూ ఎందుకు నేరుగా మీడియాతోమాట్లాడటం లేదని నిలదీశారు. వైయస్‌జగన్ పబ్లిక్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు అజ్ఞాతంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం ఎందుకని నిలదీశారు. వైయస్ జగన్ పెట్టిన డెడ్‌లైన్‌కు మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.