ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. . నాడు వెంకటేశ్వర స్వామి సన్నదిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. టీడీపీ నాయకులు చీము నెత్తురు లేకుండా ఇంకా కేంద్రంతో కలిసి పని చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వైయస్ జగన్ పెట్టిన డెడ్‌లైన్‌కు మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
see also..ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
మరోపక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీలో కలవరం మొదలైందని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. వైయస్ జగన్ ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకటించారన్నారు. ఇవాళ టీడీపీకి చెందిన ముగ్గురు మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి వైయస్ జగన్‌పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. వైయస్ జగన్ పాదయాత్రకు జనాలు రావడం లేదా? డ్రామాలు ఆడుతున్నామా? వైయస్ జగన్ ప్రకటించిన ప్రణాళిక ప్రకారం ఇంకా కొన్ని నెలలు ఎన్నికలకు సమయం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేసే రాజీనామాల అంశాన్ని నీరుగార్చేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. కేంద్రంతో పోరాడే తత్వం వైయస్ జగన్‌కు ఇది కొత్త కాదన్నారు. ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ ప్రకటనలు ఉన్నాయన్నారు. చంద్రబాబు 26 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి..ఇవాళ ఏమీ చేయలేక నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.