విలువు, విశ్వసనీయతకు మారుపేరు, మాట ఇస్తే మడమతిప్పని నైజం. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగానే తన కార్యాచరణను ప్రకటించారు. తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకు తేదీని కూడా ఖరారు చేశారు వైఎస్ జగన్.
అయితే, ఎంపీల రాజీనామా విషయంపై గతంలోనే స్పష్టమైన వైఖరిని ప్రకటించారు వైఎస్ జగన్. మూడు సంవత్సరాల పాలన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తామని వైఎస్ జగన్ చెప్పిన వియం తెలిసిందే. అన్నదే తడవుగా తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీకి మొండి చేయి చూపించడంతో తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. ఏప్రిల్ 5వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మరుటి రోజే 6వ తేదీన వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పారు.