వైసీపీ అధినేత జగన్ చేసిన సంచలన ప్రకటన దెబ్బకి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ పచ్చ వ్యాఖ్యలకు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు తమలోపల ఉన్న పచ్చ విషాన్ని బయటకు కక్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒకటవ తేదీ అని డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని… ఏపీ ప్రజలను ఏపీ ఫూల్స్ చేయడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభించారని ఎల్లో కూతలు కూస్తున్నారు.
ఇక మరోవైపు ఇదే వ్యవహారం పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా దిక్కుమాలిన విమర్శలు గుప్పించారు. జగన్ ఎంపీల రాజీనామా డ్రామాను మళ్లీ మొదలెట్టారని ఎద్దేవా చేశారు. తన ఎంపీలతో రెండేళ్ల కిందటే రాజీనామా చేయించాల్సిందని, ఇదంతా ఓ నాటకమని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతును బీజేపీ కోరకపోయినా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని, తన మద్దతు ఎన్డీఏ అభ్యర్థికేనని ప్రకటించాడని ఆయన తెలిపారు. ఇదంతా తన పై కేసులు మాఫీచేసుకోడానికే వేసిన ఎత్తుగడ అని దుయ్యబట్టారు. ఢిల్లీలో లాలూచి పడి జైలుకు వెళ్లకుండా తప్పించుకోడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని దిక్కుమాలిన విమర్శలతో తమ నోటికి పని చెబుతున్నారు టీడీపీ తమ్ముళ్లు.