ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశారని, ఇంకో బోడిగుండు అయిన గల్లా జయదేవ్ కేంద్రం మనకు ఏదో చేసేసిందని చెప్పి సన్మానాలు చేయించుకుని ఊరేగుతున్నారని విమర్శించారు.
ఈ గల్లా జయదేవ్‌ని నేనొక్కటే ప్రశ్నిస్తున్నాను.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెడతారా.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా.. సమయానికి టాయిలెట్లు కట్టకపోతే కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ చంద్రబాబు వారిని బెదిరిస్తారు.. మరి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వన్నప్పుడు కేంద్రం పై పోరాటం చేస్తానని చంద్రబాబు ఎందుకు అనడం లేదని రోజా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా జగన్ లాంటిదైతే.. ప్రత్యేక ప్యాకేజ్ ఎవరికీ పనికిరాని చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిదని లోకేష్ పై రోజా సెటైర్లు వేశారు.
ఇక పదేపదే మీడియా ముందుకు వచ్చి వాట్ ఐయాస్ సేయింగ్ అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు ఎందుకు రావడం లేదో చెప్పాలని రోజా మండిపడ్డారు. ఓటుకు నోటులో దొరికినప్పుడు కూడా ఇదే తరహాలో చంద్రబాబు 16 రోజులు మీడియా ముందుకు రాకుండా దాక్కున్నారని.. ఇప్పుడు కూడా అదే చేస్తుండడం బట్టే చంద్రబాబు తప్పు చేశారన్నది నిర్ధారణ అవుతోందనిరోజా వ్యాఖ్యానించారు. పత్రికల్లో మాత్రం పళ్లు కొరికా, నిప్పులు కురిపించా అంటూ కథలు రాయించుకుంటున్నారని.. ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్ మరోసారి టీడీపీ బ్యాచ్‌ను రఫ్ఫాడించారు. దీంతో కరెక్ట్ టైమ్‌లో రోజా తన నోటికి పని చెప్పిందని.. రోజా వ్యాఖ్యలకు టీడీపీ గ్యాంగ్ రియాక్షన్ ఎలా ఉండనుందో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.