ఆ అమ్మాయి కుడి కన్ను కొట్టింది… కుర్రాళ్ల గుండె జారింది. ఎడమ కన్నుకొట్టింది..కుర్రాళ్ల గుండె లయ తపపింది. ప్రపంచమంతా తన వైపు చూసేలా కన్ను గీటింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరునుకుంటున్నారా..? ఆమెనే కేరళ కుట్టీ ప్రియా ప్రకాష్ వారియర్. నిన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్షేషన్ అయింది. అమ్మాయి కన్ను కొట్టడమనేది ఇంటర్నెట్ సెన్షేషన్ కావడం విచిత్రమే అయినా.. కానీ, ప్రియా ప్రకాష్ వారియర్ అనే ఈ కేరళ కుట్టి జనాల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన ఓరు ఆధార్ లవ్ అనే సినిమాలోని ఒక పాట ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటలో పెద్ద విశేషమేమీ లేకపోయినా కానీ.. అయితే, పాట మధ్యలో ఈ అ మ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌కి యూత్ ఫిదా అయిపోతున్నారు.
టీనేజ్ అమ్మాయి, టీనేజ్ అబ్బాయి ప్రేమల గురించి ఎన్నో కథలు వచ్చాయి. సెన్షేషన్ హిట్ అయ్యాయి కూడాను. అంతేకాక, ప్రేమమ్ సినిమాలోని ఒక ఎపిసోడ్ ఇలానే ఉంటుంది. అయినా, ఈ సినిమాలోని టీనేజ్ అమ్మాయి, అబ్బాయి మధ్య కనుసైగల ఎపిసోడ్‌కే మిలియన్ల కొద్దీ వ్యూస్. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ భామకు ఇప్పుడు ఇన్‌స్ర్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. కేరళలోని త్రిశూల్‌లో చదువుకుంటోంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఇంటర్నెట్ యుగంలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో చెప్పలేమనడానికి ప్రియా ప్రకాష్ మరో ఎగ్జాంపుల్. ఎవరికిఈ పెద్దగా తెలియదు.
ఇదిలా ఉండగా గత ఏడాది విడుదలైన నాని ఎంసీఏ మూవీలోని ఓ డైలాగ్.. ఎప్పుడైనా అలా రోడ్డు మీద వెళ్తూ బస్టాప్‌లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఒక ఫ్యామిలీ ఫోటోను ఊహించుకున్నావా..?
ఇప్పుడు ఇదే డైలాగ్‌ను అనుసరిస్తూ.. ప్రియా ప్రకాష్ వారియర్‌పై కామెంట్లు పెడుతున్నారు. అదేంటంటే.. ”ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసి ఇద్దరు.. ముగ్గురు పిల్లలతో ఒక ఫ్యామిలీ ఫోటోను ఊహించుకున్నావా”..?
ఇంతకీ ప్రియా ప్రకాష్ వారియర్‌ను చూడగానే మీకు గుర్తొచ్చే పాటేమిటో… కామెంట్ రూపంలో తెలియజేయండి.