గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫలక్నామా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.మలయాళ మూవీ ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాలోని సాంగ్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఫరూక్ నగర్‌కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా నటించింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పాటలోని లిరిక్స్‌లో అభ్యంతరకర పదాలున్నాయని, ఈ పదాలన్నీ తమ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
