దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాలక కోరిక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఈ నేపత్యంలో 2014 ఎన్నికల్లో బూటకపు హామీలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడుతోంది. ఇందుకు నిదర్శనం పోలవరం తహశీల్దారును బదిలీ చేయడమే. అంతేకాకుండా. కాగ్ నివేదికలోనూ పోలవరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని లెక్కలతో సహా బయట పెట్టాయి. మరోవైపు చంద్రబాబు తన అనుచరవర్గాలకే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఇస్తూ ఇబ్బడి ముబ్బడిగా కమిషన్ల దందాను కొనసాగించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై పోరాటానికి టీడీపీ వెనక్కు తగ్గినట్లు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదాపై గళమెత్తితే.. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాన్ని పైకి తెచ్చి.. ఆ కారణంతో జైలుకెక్కడ పంపుతారోనన్న భయంతో టీడీపీ నాయకులు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదు. అందులోను ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఏపీ రెవెన్యూ లోటులో 3వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం రావడంతో బీజేజీ కేంద్ర నాయకులు.. చంద్రబాబు అవినీతిని తవ్వే పనిలో ఉన్నారు.