ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గ్యాంగ్‌కి తాజాగా బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు జైలుశిక్ష విధించింది. గతంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వట్టి వసంతకుమార్‌ను కొట్టిన కేసులో చంతమనేనికి బీమడోలు కోర్టు బుధవారం మూడేళ్లు జైలు శిక్ష విధించింది. 2011 జన్మభూమి కార్యక్రమంలో ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడిచేసినట్లు కేసు నమోదయింది. విచారణ జరిపిన పోలీసులు కేసును న్యాయస్థానం ముందుంచారు. దీంతో వట్టి వసంతకుమార్ ను కొట్టిన కేసులో చింతమనేనికి ఆరునెలల జైలు శిక్ష, 500ల జరిమానా విధించింది భీమడోలు కోర్టు. 2011 జూన్ నెలలో దెందులూరు హైస్కూల్ లో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్ పై దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని దౌర్జన్యం చేయడంతో పాటు అప్పటి ఎంపీ కావూరి సాంబశివరావు , ప్రజలందరి సమక్షంలో చేయి చేసుకున్నారు.
see also : ఓ మై గాడ్.. జగన్ జస్ట్ మిస్..!
అయితే ఈ వివాదం పై అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ గన్‌మెన్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీని పై పోలీసులు నాలుగు సెక్షన్లగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లుగా కేసు వాదోపవాదనలు జరగ్గా.. బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది.
సెక్షన్ 506(2) గా రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయిల జరిమానా….సెక్షన్ 353 గా ఆరు నెలల జైలు శిక్ష, వేయి రూపాయిల జరిమానా, సెక్షన్ 7(1) గా ఆరు నెలలు జైలు శిక్ష తో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. మొత్తంగా మూడేళ్ల జైలు శిక్ష, 2500 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తీర్పునివ్వడంతో చింతమనేనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష వర్తిస్తుంది. తీర్పు వెలువడే సమయంలో తన అనుచరులతో చింతమనేని కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చింతమనేని బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక చింతమనేని పై ఇప్పటికే పలు కేసులున్న విషయం తెలిసిందే. తనదైన దూకుడు వల్ల చింతమనేని అనేకమార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తన పద్దతి మార్చుకోలేదు. ఇపుడు వట్టి వసంతకుమార్ కేసులో చింతమనేనికి జైలుశిక్ష పడటంతో టీడీపీ గ్యాంగ్ షాక్‌కు గురైంది.
see also : ”ప్రియా ప్రకాష్ వారియర్”ను చూడగానే మీకు గుర్తొచ్చే పాట..!?
see also : రెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లు విడుదల..!