వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు ఎర్రబల్లిక్రాస్, కొండాపురం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పాదయాత్ర 11:30 గంటలకు రేనమాలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ లంచ్ విరామం తీసుకుంటారు. 2:45 గంటలకు మళ్లీ పాదయాత్ర కొనసాగించి 3 గంటలకు రేనమాలలో వైఎస్ జగన్ మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
