ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఉదయగిరి నియోజక వర్గంలో జోరుగా సాగుతున్న జగన్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిన జగన్ కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్ చేరుకోగానే… తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చారు.
see also : చంద్రబాబు గ్యాంగ్‌కి బిగ్ షాక్…!
అయితే ఆ బాణసంచా కాస్తా రోడ్డు పక్కనే ఉన్న పొదలు, ఎండుగడ్డి పై పడటంతో.. అక్కడ మంటలు వ్యాపించి… దట్టమైన పొగ అలముకుంది. ఆ మంటలను దాటి ముందుకు సాగడానికి పాదయాత్రకు ఇబ్బంది కలిగింది. ఎండుగడ్డి పైకి ఎగురుతూ.. జగన్‌కి అతి సమీపంలోకి వచ్చి పడింది.. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు జగన్‌ను సురక్షితంగా మంటలు వ్యాపించిన ప్రదేశం నుంచి దాటించారు. అనంతరం వైసీసీ నేతలు మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
see also : రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్లు విడుదల..!