ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటే మేము కూడా అంటూ నెల్లూరు జిల్లా ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. అయితే, 86వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో పై ఫోటోలో కనబడుతున్న ఓ అవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు 70 ఏళ్లుపైబడిన ఆ వృద్ధురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని.. పరుగు.. పరుగున ప్రజా సంకల్ప యాత్రలో అందరికంటే ముందు నడుస్తూ జై జగన్.. జై వైఎస్ఆర్ ఆంటూ నినాదాలు చేసింది. ఇలా పాదయాత్ర ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా నడుస్తూ నినాదాలు చేసింది ఈ70 ఏళ్ల వృద్ధురాలు.