అక్కంపేట-మెదక్,కొత్తపల్లి- మనోహరాబాద్ రైలు మార్గాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేఅధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు.2019 కొత్త సంవత్సరంలొ దక్షిణ మధ్య రైల్వే జి.ఎం,సీ ఎం కేసీఆర్ తో కలిసి గజ్వెల్ కు రైలులో ప్రయాణించాలని ఆయన అన్నారు. అక్కంపేట-మెదక్ మధ్య 11 బాటిల్ నెక్ సమస్యలు న్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని హరీశ్ రావు కోరారు.రాష్ట్రంలో ఉన్న 460 రైల్వేలెవెల్ క్రాసింగులకు ఆర్వోబి ల నిర్మాణ పనులు చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. 460 ఆర్వోబీల నిర్మాణం దశల వారీగాచేపడుతున్నట్టు ఆయన చెప్పారు. పెండింగ్ బ్రిడ్జి నిర్మాణాలపై ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జలసౌధ లో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. రహదారులు భవనములు శాఖ మంత్రి తుమ్మల, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ , రైల్వే జి. ఎం వినోద్ యాదవ్, ఇతర రాష్ట్ర ఉన్నాతాధికారులుపాల్గొన్నారు.
