Home / TELANGANA / ఇక డిజిటల్‌ పాలన.. ప్రగతిభవన్‌, సచివాలయం నుంచే వీక్షణ..!

ఇక డిజిటల్‌ పాలన.. ప్రగతిభవన్‌, సచివాలయం నుంచే వీక్షణ..!

తెలంగాణలో అతి కొద్ది రోజుల్లో ఈ(ఎలక్ట్రానిక్‌) డిజిటల్‌ పరిపాలనను చూడబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్‌, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏర్పాటు కానుంది.అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి దీనిని అమల్లోకి తేనున్నారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాల్లో డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలు, సంఘటనలు, కార్యక్రమాలను నేరుగా చూసే అవకాశం లభిస్తుంది. సమీక్షలనూ పర్యవేక్షించవచ్చు. దీనికి అవసరమైన డేటా నెట్‌వర్క్‌ పని ఇప్పటికే ప్రారంభమైంది. పోలీసు శాఖ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం తయారీకి సిద్ధమైంది. సాధారణ పరిపాలనకు సైతం ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

see also : ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి..కేటీఆర్

ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ల నుంచి సచివాలయానికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఉంది. అధికారులు కార్యాలయాల్లో కూర్చునే మాట్లాడే సౌకర్యం ఉంది. కొత్త విధానం మరింత విస్తృతంగా ఉంటుంది. అధికారులు ఎక్కడున్నా మాట్లాడే వీలుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో నేరుగా ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ తెస్తారు. దీంతో పాటు క్షేత్రస్థాయి సమాచారం కోసం శాటిలైట్‌ వీడియో నెట్‌ వర్క్‌ను వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్‌ పాలనకు వీలుగా అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది. ప్రతి అధికారికి ప్రభుత్వం తరఫున ఐడియా నెట్‌వర్క్‌ ద్వారా చరవాణి సంఖ్యను ఇవ్వనుంది. అధికారులందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నందున వీడియో కాలింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. అధికారుల ఫోన్‌ నంబర్లను ఇంటర్నెట్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ రూంకు సంధానం చేస్తారు. దీంతో పాటు పోలీసుశాఖకు చెందిన కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ప్రధాన కమాండ్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సైతం సీఎం, సీఎస్‌లు అక్కడి పరిస్థితులను వీక్షించే వీలుంటుంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సీఎం కేసీఆర్‌ దీనికి ఆమోదం తెలిపారు. సీఎస్‌ సూచనలకు అనుగుణంగా ఐటీ శాఖ ఈ ఏర్పాట్లను ప్రారంభించింది. త్వరలో ఫైబర్‌ గ్రిడ్‌ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు గ్రామస్థాయి సమాచారాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించే వీలు ఉంటుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

సీఎం కేసీఆర్‌ నీటిపారుదల ప్రాజెక్టుల అధ్యయనానికి గూగుల్‌ శాటిలైట్‌ పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. శాసనసభలో ప్రాజెక్టులపై దృశ్యరూపక వివరణ ఇచ్చారు. కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఏర్పాటులో ఇలాంటి సాంకేతిక అంశాలను పరిగణనలోని తీసుకుంటారు. కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాలనను దీని ద్వారా పర్యవేక్షించనున్నారు. కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలతో పాటు జిల్లా అభివృద్ధి మండళ్ల సమీక్షలు, జిల్లా పరిషత్‌ సమావేశాలు, ఇతర ముఖ్య సమీక్షలు సీఎం, సీఎస్‌లు చూస్తారు.

దస్త్రాల పరిష్కారానికి…

దస్త్రాల పరిష్కారానికి కూడా ఆధునిక విధానాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి దస్త్రాన్ని బార్‌కోడింగ్‌తో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి, వాటి స్థితిగతులను తెలుసుకోవడానికి ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.ప్రభుత్వ శాఖల్లోని మొత్తం సమాచారాన్ని క్రోడీకరిస్తూ ప్రత్యేక నమోదు కేంద్రం(డాష్‌బోర్డు)ను కూడా ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు.

* వరంగల్‌ జిల్లా పరిషత్‌ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి ప్రత్యక్షంగా చూస్తారు. సభ్యులేమి అడుగుతున్నారు? అధికారులేం జవాబిస్తున్నారు? చర్చలు ఎలా సాగుతున్నాయనేది తెలుసుకుంటారు.

* కరీంనగర్‌ మార్కెట్‌ యార్డులో మద్దతు ధరల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు.దీనిని కూడా సీఎం, సీఎస్‌లు నేరుగా వీక్షిస్తారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన ఉన్నతాధికారులు అక్కడి నుంచి నేరుగా సీఎస్‌కు పురోగతిని వీడియో ద్వారా వెల్లడిస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat