పకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో ఫైనాపిల్ ఒకటి.ఇది ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఒక అద్బుతమైన ఫలమని చెప్పాలి.ఇందులో మిటమిన్ సి,ఫోటేట్,థయామిన్,పోటాషియం,కాపర్,మాగానీ స్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లును పుష్కలంగా కలిగి ఉంది.అయితే ఫైనాపిల్ తినడం వలన కొన్ని అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఫైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మిటమిన్ సి పుష్కలంగా లబిస్తాయి.ఇందులో ఉండే పోటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.
- శరీర భాగాలకు ప్రాణ వాయువును మంచిగా అందిస్తాయి.శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరానికి హాని చేసే అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.
see also : పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు
- ఫైనాపిల్ పండులో మిటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ కూడా సంవృద్దిగా లబిస్తుంది.ఈ పోషకాలు కళ్ళకు చాలా మంచిది.
- ఫైనాపిల్ లో ఉండే పోటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది.రక్త పోటు రాకుండా కాపాడుతుంది.
- మాంగనీస్ శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపడంలో ఫైనాపిల్ తోడ్పడుతుంది.
- కీళ్ళ నొప్పుల సమస్యతో భాధపడే వారిపాలిట ఫైనాపిల్ ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు.ఇందులో మిటమిన్ సి మరియు మాంగనీస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.
see also : అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
- ఫైనాపిల్ లో బ్రోమిలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది తీ సుకున్న ఆహారాన్ని ప్రోటీన్లుగా మార్చి జీర్ణం చేస్తుంది.అందువల్ల అజీర్తికి ఇది ఒక చక్కని మందు అవుతుంది.
- ఫైనాపిల్ లో ఉండే మిటమిన్ సి అన్ని రకాల నోటి సమస్యలను నివారిస్తుంది.తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పిని నివారిస్తుంది.అంతే కాకుండా తాజా ఫైనాపిల్ రసాన్ని తీ సుకోవడం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
- కడుపులో ఏర్పడే వికారాలను తగ్గిస్తుంది .కడుపు నొప్పి ,ఉబ్బరంగా ఉండ్సే ఉదర సమస్యలను తగ్గిస్తుంది.