ఏపీలో పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు ,ఎంపీలకు ప్రజల నుండి పలు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి..పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గిద్దలూరు అసెంబ్లీ నియోజక్ వర్గం నుండి గెలుపొంది అధికార టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి దళిత సామాజిక వర్గం నుండి తీవ్ర అవమానం ఎదురైంది.
see also :ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!
అసలు విషయానికి నియోజక వర్గంలో గిద్దలూరు మండలంలో సంజీవరావు పేట గ్రామంలో జరిగిన దళిత తేజో కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు.అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ బలోపేతం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు దళితులు చెప్పులు చూపిస్తూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ ను మీ స్వార్ధం కోసం అన్యాయంగా బలిపశువు చేస్తూ సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు.
see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!
అంతే కాకుండా ఒక పార్టీ తరపున గెలిపిస్తే వేరే పార్టీలో చేరి కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన మీరు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే మీ అంతు తేలుస్తామని చెప్పులు చూపిస్తూ మరి ప్రజలు వార్నింగ్ ఇచ్చారు.అయితే ఇప్పటికే ప్రజల నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకతతో పాటుగా బాబు టికెట్లు ఇస్తాడో లేదో అని సందిగ్ధంలో ఉన్న ఫిరాయింపులకు ఇలా చెప్పులతో స్వాగతం పలకడం వారి రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో పడేసింది.