ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వచ్చే నెల ( మార్చి ) 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తామని.. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ ప్రజసంకల్ప ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.గత కొద్ది నిమిషాల క్రితం అయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకోసం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి బీజేపీపై పోరాటం చేయాలని కోరారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి అందరితో కలిసి హోదా కోసం పోరాడాలని అయన సూచించారు.