కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి ఉందా..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారిందన్నారు. వైసీపీని ఏపీ నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
