ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా మిత్రపక్షమైన బీజేపీ తుంగలో తొక్కడం.అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలకు గుర్తు రాని విభజన చట్టంలో హామీలు ,రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు గుర్తుకు రావడం ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు సామాన్య ప్రజలకు కూడా తీవ్ర విస్మయాన్ని కల్గిస్తుంది.అయితే సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలోనే ఉండటంతో టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ పై అనవసర విమర్శలు చేస్తుందని కమలం నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.
see also : ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!
ఇది అంతా ఒక ఎత్తు అయితే టీడీపీ తరపున ఎంపీగా ఉండి కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తమ్ముడుతో సహా ఇద్దరు ఎంపీలు ఇప్పుడు కమలం వైపు చూస్తున్నారు అని రాష్ట్ర రాజకీయాల్లో కోడై కూస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఇటివల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధానిలో అందుబాటులో ఉన్న ఎంపీలతో బడ్జెట్లో నిధులు కేటాయింపుపై చర్చించడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి వర్గంగా ఉన్న ఎంపీలు కేశినేని నాని ,కోణకళ్ళ నారాయణ గైర్హాజరయ్యారు.అయితే ఈ ఇద్దరు ఎంపీలు కావాలనే ఇలా గైర్హాజరయ్యారు అని రాజకీయ వర్గాలు గుస గుస లాడుకుంటున్నారు.గత నాలుగు ఏండ్లుగా బాబు ఎట్లా చెబితే అట్లా ఆడిన ఎంపీలు ఇప్పుడు రాజకీయ స్వార్ధం కోసం బీజేపీ పై నిప్పులు చెరగడం వీరిద్దరితో పాటుగా కేంద్ర మంత్రి సుజనా కి నచ్చలేదు అంట .
see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!
అందుకే ఇటివల బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు పార్లమెంటు లో ధర్నాలు ,నిరసనలు చేస్తుంటే కేంద్ర మంత్రి అయిన సుజన మాత్రం ప్రధాని మోదీ ,కమలం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉల్లాసంగా తనకు ఏమి పట్టనట్లు ఉన్నాడు.అయితే ఈ ముగ్గురు కమలం వైపు చూస్తున్నారు కాబట్టే బాబు నిర్వహించిన సమావేశానికి నగరంలో ఉండి కూడా గైర్హాజరయ్యారు.అయితే రానున్న ఎన్నికల్లో ఇటు కేశినానికి అటు నారాయణకు టికెట్ ఇవ్వను అని ఇప్పటికే తేల్చేశాడు అంట .మరోవైపు బాబు కేంద్రమంత్రి సుజన కంటే మరో ఎంపీ సీఎం రమేష్ కే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో సుజనకు నచ్చడంలేదు అంట.అందుకే తార్కాణమే ఇటివల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా నంద్యాల ఉప ఎన్నికల సమరం.దీంతో ఈ ముగ్గురు త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని ఏపీ రాజకీయ వర్గాల ఇన్నర్ టాక్..
see also :ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్