దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టి సత్తాచాటాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో చిత్తుగా విఫలమైన రోహిత్.. ఐదో వన్డేలో మాత్రం విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ ఆరంభంలోనే ధవన్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో కోహ్లీతో కలిసి రోహిత్ 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు . ఇన్నింగ్స్‌లో 107 పరుగులు ఆడిన రోహిత్ 4 సిక్సులు, 10 ఫోర్లు ఆడిన తన కెరీర్లో 17వ సెంచరీ, సౌతాఫ్రికాపై 2వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ 36 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
