అవును, మీరు చదివింది నిజమే. ఇంటర్‌నెట్‌లో పప్పు అని టైప్ చేస్తే ఓ ఇద్దరు రాజకీయ నాయకుల ఫోటోలు ప్రత్యక్షమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరిలో ఒకరు తండ్రి అండతో మంత్రి పదవి అనుభవిస్తుండగా.. మరొకరు ప్రధానమంత్రి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారునుకోండి.. అది వేరే విషయం..!! ఇప్పుడు వీరిద్దరిని ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఓ ప్రోగ్రామ్ లో పాటిస్పేట్ చేసే కమెడియన్లు విచ్చల విడిగా వాడేస్తున్నారు.
see also : వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు
ఇంతకీ వారిద్దరూ పప్పు అని టైప్ చేయకుండానే ప్రత్యక్షమవుతున్నారా..? అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..
see also : ‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా సర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!
అయితే, ఇటీవల విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమోలో రాకింగ్ రాజేష్, నిహాంత్‌ల కామెడీ పంచ్ లైన్‌లు ఏపీ మంత్రి, నారా లోకేష్, అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని గుర్తు తెచ్చాయి. ఈ సంభాషణలు మరో సారి వివాదానికి తెరతీసేలా ఉన్నాయి. అసలు విషయానికొస్తే.. రాకింగ్ రాజేష్ ప్రోగ్రామ్‌లో భాగంగా నవ రసాల్లో నీకు ఏరసమంటే ఇష్టంరా..? అని నీహాంత్‌ను అడగ్గా.. చెరుకు రసం.. చెరుకు రసం తాగి, తరువాత పప్పన్నం తింటే ఉంటుందీ..!! మా అమ్మ పొద్దున ఓ పప్పు.. మధ్యాహ్నం ఓ పప్పు.. రాత్రికి ఓ పప్పు అంటూ మూడు సార్లు పప్పు పప్పు పప్పు అంటూ చివరకు నన్ను పప్పుగాడ్ని చేసింది అంటూ చెప్పిన డైలాగ్‌లు జబర్దస్త్ ప్రేక్షకుల కళ్లల్లో ఒక్కసారిగా ఆ… ఆ.. ఇద్దరూ ప్రత్యక్షమయ్యేలా చేశాయి. ఇలా పప్పు అనే పదాన్ని జబర్దస్త్‌లో వీలు చిక్కినప్పుడల్లా తెగవాడేస్తుండటం గమనార్హం.