వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గత అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని చెప్పారు.
అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ వ్యాప్తంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, నీవెంట మేమూ ఉన్నామంటూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, నేతలతోపాటు ప్రజలు కూడా జగన్ అడుగులో అడుగు వేస్తూ ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను ముందుకు విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
see also : ‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా సర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!
ఇదిలా ఉండగా.. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా బయటకు రాదని, కానీ వైఎస్ జగన్ మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.
see also : నాడు వైఎస్‌ఆర్.. నేడు వైఎస్ జగన్ – 2019లో హిస్టరీ రిపీట్..!! ”ఇది ఫిక్స్”
జగన్‌పై ఉన్న కేసుల గురించి మాట్లాడుతూ.. అయితే, జగన్‌పై ఉన్న కేసులో 11 మంది ఐఏఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎనిమింది మంది ఐఏఎస్ అధికారులు క్లీన్ చిట్‌తో బటకు వచ్చారు. ఇక మిగిలింది ముగ్గురే. వారు కూడా ఇవాళో.. రేపో బయటకు వస్తారు… కదా అంటూ చెప్పారు. ఇలా వైఎస్ జగన్ పై ఉన్న కేసులన్నీ వీగిపోయి క్లీన్ చిట్ రావడం పక్కా అంటూ లాజిక్‌తో సహా వివరించారు సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ రవిశంకర్.